Agnisakshi Telugu Serial అగ్నిసాక్షికి గౌరీ గుడ్ బై – షాకింగ్ నిర్ణయం పై జోరుగా చర్చ… దీనిలో నిజం ఎంత?

నేమ్ లో ఏముంది అనుకుంటాం. కానీ పేరుని బట్టి కొన్ని కళ్ళముందే కదలాడుతాయి. అంతగా కొందరు ప్రభావితం చేస్తారు. ఉదాహరణకు ఐశ్వర్య లా ఉన్నావ్ అన్నారంటే, మనకు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది. కానీ తెలుగు సినిమాల్లో కూడా ఒకప్పటి నటి లక్ష్మి కూతురు నటి ఐశ్వర్య కూడా ఉంది. అయితే, దీనికన్నా ముందు బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకుల మదిలో మెదిలే ఐశ్వర్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అగ్నిసాక్షి సీరియల్ లో గౌరీ పాత్ర ద్వారా పరిచయమైన ఈ కన్నడ ముద్దుగుమ్మ తననటనతో టివి ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
కర్ణాటక లోనే పుట్టి పెరిగిన ఐశ్వర్య 2017డిసెంబర్ 4న స్టార్ మా ద్వారా అగ్ని సాక్షి సీరియల్ లీడ్ రోల్ గౌరీ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సీరియల్ డైలీ చూసేవారికి ఐశ్వర్య గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే తెరమీద ఆమె కన్నీళ్లు పెడితే,ప్రేక్షకులకు కంటనీరు వచ్చేస్తుంది.

ఆమె నవ్వితే,ప్రేక్షకుల పెదవులపై నవ్వులు విరబూస్తాయి. అంతలా టివి ప్రేక్షకులను తన అందంతో,తన నటనతో మెస్మరైజ్ చేసింది. నిజానికి ఈ సీరియల్ తోనే తెలుగువారికి కనెక్ట్ అయింది ఐశ్వర్య. ఇక ఐశ్వర్య తల్లి ఆమెకు డాన్స్,యాక్టింగ్ చిన్నతనం నుంచి నేర్పించడంతో చదువు పూర్తయిన వెంటనే తెరమీదికి అడుగుపెట్టింది. ముందుగా టివి రంగాన్ని ఎంచుకుని, కన్నడనాట పలు సీరియల్స్ లో నటించి నటిగా తానేమిటో నిరూపించుకుంది.
agni sakshi serial gouri



గిరిజా కల్యాణ పేరిట సీరియల్ లో స్టార్ మా ఇచ్చిన ఛాన్స్ తో బుల్లితెర మీద తన హవా కొనసాగిస్తున్న సమయంలోనే అక్కడి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనూరాధ రూపంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. నిజానికి తెలుగు రాకపోవడంతో అగ్ని సాక్షి లీడ్ రోల్ చేయడానికి ఐశ్వర్య తటపటాయిస్తుంటే,తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో నటించడానికి ముందుకొచ్చింది. అయితే మొదట్లో తెలుగురాక కొంత ఇబ్బంది పడినా, తర్వాత అల్లుకుపోయింది.



ఇప్పుడు తెలుగు అదరగొట్టేస్తూ, తెలుగు బుల్లితెరపై క్రేజ్ తో దూసుపోతున్న ఐశ్వర్య ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే అగ్నిసాక్షిలో అర్జున్ తో ఈమె పేరు మారుమోగి పోతున్నందున ఇద్దరూ మ్యారేజ్ చేసుకుంటే చూడాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా మంచి ఛాన్సులు వస్తున్న ఈసమయంలోనే పెళ్లి చేసుకుని జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని భావిస్తోంది.