Bigg Boss 2 Telugu Season 2 Updates: మనది కాని రియాల్టీ షో మనవాళ్ళు ఎలా ఆదరిస్తారు?ఇలాంటి షోలు మనకు పడవు. ఆకట్టుకోవు .. ఇలా బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో మొదలవుతున్న సమయంలో అందరినోటా వినిపించిన మాట. ఉత్తరాదిన ఇప్పటికే 10సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్ బాస్ షో తెలుగువారికి పరిచయం అయింది మాత్రం రెండేళ్ల క్రితమే. ప్రస్తుతం బుల్లితెర సెన్షేషనల్ షో నడుస్తున్న బిగ్ బాస్ కి సీజన్ వన్ లో తన హోస్ట్ తో జూనియర్ ఎన్టీఆర్ తళుకులు అద్దాడు. ఇక సీజన్ టు కి తారక్ రావడం లేదని తెల్సి చాలామంది ఢీలా పడ్డారు. ఈ షో ఎలా ఉంటుందో ఏమిటో అనుకున్నారు. అయితే నేచురల్ స్టార్ నాని యాంకరింగ్ తో స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ టు మొదట్లో కొంత తేడా కనిపించినా ఆతర్వాత నుంచి పట్టాలెక్కింది. ఇక సీజన్ మొదలై 100రోజులు దాటిన నేపథ్యంలో ఇక చివరి అంకంలో ఉంది.
తారక్ హోస్ట్ గా సాగిన బిగ్ బాస్ సీజన్ వన్ 70రోజులపాటు నడిచింది. 16మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా, 60కెమెరాలు పనితనం చూపాయి. అప్పటి ఫైనల్స్ లో శివ బాలాజీ, అర్చన,ఆదర్శ్,హరితేజ,నవదీప్ మిగిలారు. అతితక్కువ ఓట్లు నమోదుకావడంతో ముందుగా అర్చన ఎలిమినేట్ అయింది. దాంతో మొదలైన లిమినేషన్ ప్రక్రియ లో ఆతర్వాత తక్కువ ఓట్లు దక్కడంతో నవదీప్ కూడా నిష్క్రమించాడు. ఇక ఆదర్శ్, శివబాలాజీ,హరితేజ మిగలడంతో10లక్షలు తీసుకుని ఎవరైనా వెనక్కి వెళ్లిపోవచ్చన్న బంపర్ ఆఫర్ ఎన్టీఆర్ ఇచ్చినా ఎవరూ వెనక్కి తగ్గలేదు.
అయితే ఈ ముగ్గురిలో ఆడియన్స్ వేసిన ఓట్ల ఆధారంగా తక్కువ ఓట్లు వచ్చిన హరితేజ మూడవ స్థానంతో సరిపెట్టుకుని బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఇక మిగిలిన ఆదర్శ్, శివబాలాజీ లలో అధిక ఓట్లు తెచ్చుకున్న శివబాలాజిని తారక్ విజేతగా ప్రకటించాడు. ఈ విధంగా రసవత్తరంగా సాగిన సీజన్ వన్ ఫైనల్ ని దృష్టిలో ఉంచుకుంటే సీజన్ టు ఫైనల్ ఎలా ఉంటుందోనని ఆడియన్స్ లో ఆతృత పెరిగింది. సీజన్ వన్ లో ఆడియన్స్ ఓట్లు సీజన్ విన్నర్ ని నిర్ణయించగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఆడియన్స్ కి విలువ ఇచ్చి విజేతను నిర్ణయించేసారు.
అయితే సీజన్ 2లో కూడా వన్ మాదిరిగా నడిస్తే,కౌశల్,గీతా, తనీష్ లు ఫైనల్ లో మిగులుతారని అంచనాకు రావచ్చు. సీజన్ వన్ మాదిరిగా డబ్బు ఆఫర్ ఇచ్చి ఎవరైనా వెళ్లిపోవచ్చని హోస్ట్ నాని కోరే ఛాన్స్ ఉందని అంటున్నారు. పోటాపోటీగా గేమ్ ఆడిన ఈ ముగ్గురిలో ఎవరూ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండకపోవచ్చు.
అప్పుడు ఆడియన్స్ ఓట్ల ఆధారంగానే విన్నర్ ని డిసైడ్ చేస్తారు. అదే జరిగితే కౌశల్ విజేత అవుతాడని చెప్పవచ్చు. కానీ సీజన్ టుకి ఇచ్చిన ఏదైనా జరగవచ్చు అనే ట్యాగ్ చూస్తేనే అనుమానం వస్తోంది. లేదంటే కౌశల్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పవచ్చు. చూద్దాం ఏమి జరుగుతుందో. బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఎటువంటి అంచనాలు లేకుండా శివబాలాజీ విన్నర్ అయ్యాడు. ఇక రెండో సీజన్ కి వచ్చేసరికి కౌశల్ దాదాపుగా విన్నర్ అని ప్రచారం జరుగుతుంది. కౌషల్ ఆర్మీ కౌశల్ విన్నర్ అయ్యాలే ఓటింగ్ చేస్తుంది.

